టెన్షన్‌: ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ గృహ నిర్బధం!

టెన్షన్‌: ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ గృహ నిర్బధం!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి... మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు... సవాళ్లు, ప్రతి సవాళ్లతో బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు... దీంతో అప్రమత్తమైన పోలీసులు... తాడేపల్లిగూడెంలోని మాణిక్యాలరావు నివాసం దగ్గర, మండలంలోని వెంకట్రామన్నగూడెం గ్రామంలోనూ భారీగా మోహరించారు. నలుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 100 మంది పోలీసు సిబ్బంది మోహరించారు... తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలో మాణిక్యాలరావు గృహ నిర్భందం చేసిన పోలీసులు... మరోవైపు నిన్న రాత్రే వెంకట్రామన్నగూడెం చేరుకుని... అక్కడ పూసులూరి పుల్లారావు అనే తెలుగుదేశం కార్యకర్త ఇంట్లో ఉన్న బాపిరాజును కూడా గృహానిర్బంధం చేశారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం దగ్గర కూడా మోహరించిన పోలీసులు అవసరం మేరకు గృహనిర్భంధానికి రంగం సిద్ధం చేశారు.