విదేశాల్లో మోడీకి ధీటుగా రాహుల్ సభలు 

విదేశాల్లో మోడీకి ధీటుగా రాహుల్ సభలు 

దుబాయిలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటన ఫుల్ జోష్ గా సాగుతోంది. ఆయన సభలకు జనం పోటెత్తుతున్నారు. రాహుల్ సభకు గంటల తరబడి భారతీయులు వేచి ఉన్నారు. ఆయన సభను ఏర్పాటు చేసిన దుబాయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కిక్కిరిసిపోయింది. రాహుల్ ప్రసంగం కోసం స్టేడియంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు గంటల తరబడి వేచి చూశారు. రాహుల్ సభ కోసం కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. గతంలో ప్రధాని మోడీ సభలకు ఏ మాత్రం తీసిపోకుండా ఏర్పాట్లు చేశారు. ప్రధాని సభలకు ధీటుగా జనం రాహుల్ సభలకు వచ్చారు. ఆ దృష్యాలను జాతీయ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.