మోడీ పై మండిపడ్డ వామపక్ష నేతలు

మోడీ పై మండిపడ్డ వామపక్ష నేతలు

ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తాయని వామపక్ష నేతలు అన్నారు. విజయవాడలో సీపీఎం, సీపీఐ నేతలు, మధు, రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఆయన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి శంకుస్ధాపనకు వచ్చినప్పుడు నీళ్లు, మట్టి ఇచ్చి వెళ్లారని అన్నారు. ఆయన ప్రధాని స్దాయిని మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. మార్చి1 న విశాఖకు ప్రధాని వస్తున్నందున ఆరోజు భారీ నిరసన ప్రదర్శన చేపడుతామని తెలిపారు. నాలుగున్నరేళ్లు టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. బీజేపీ కనీసం విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతుంటే.. ప్రధాని కనీసం కరువు నివారణ చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని టీడీపీకి ముందే చెబితే పట్టించుకోలేదని అన్నారు. చంద్రబాబు దీక్షకు సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఎవరూ హజరుకావడం లేదని వారు తెలిపారు. మోడీ రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఇదే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళతామని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు.