పేకాట ఆడుతూ దొరికిపోయిన పోలీసులు

పేకాట ఆడుతూ దొరికిపోయిన పోలీసులు

బెజవాడలో బెటాలియన్ పోలీసులు బరితెగించారు. భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆకాంబిడేషన్ కేంద్రంలో పేకాట ఆడుతూ దొరికిపోయారు. విధులు పక్కనపెట్టి నిత్యం పేకాట ఆడుతూ, మద్యం తాగి వివాదాలకు దిగుతున్నారు. ఈ తతంగం అంతా ఆర్ఎస్ఐ శ్రీనివాసరావు సమక్షంలోనే జరుగుతోంది. రెండు నెలల క్రితం బెజవాడ బస్టాండులో యువతిని వేధించిన కేసులో ఒకరు, తిరుమల విధులు నిర్వహణలో మద్యం తాగి మరొకరు సస్పెన్షన్ కు గురయ్యారు. పోలీసులు విధులు పక్కనపెట్టి ఇలా మద్యం తాగి పేకాట ఆడటం చర్చినీయాంశంగా మారింది. బెటాలియన్ పోలీసుల తీరుపై ఉన్నతాధికారుల సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.