70 కోట్ల స్థలంలో రాత్రికి రాత్రే..

70 కోట్ల స్థలంలో రాత్రికి రాత్రే..

కబ్జాదారులు..ఏ స్థలాన్ని వదిలేయడం లేదు. ఆఖరికి దేవుని స్థలాన్ని కూడా  రియల్ వ్యాపారులు వదలడం లేదు. తాజాగా నెల్లూరులో జరిగిన ఓ ఘటనను ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలో  వేమల శెట్టి బావి సత్రం భూమిని రియల్ వ్యాపారులు కబ్జాలు కబ్జాకు యత్నించారు. దాదాపు రూ. 70 కోట్లు విలువచేసే రెండు ఎకరాల భూమిలో రాత్రికి రాత్రే శనీశ్వరుని విగ్రహం ప్రతిష్టించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్య వైశ్య నేతలు ఆందోళనకు దిగారు. అయితే ఈ భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఆర్యవైశ్య ల అందోళనలతో  దేవాదాయశాఖ పరిధిలోవున్నఈ భూమిలో విగ్రహాన్ని తొలగిస్తామని కబ్జాదారుల రాజీకి యత్నించారు. ఈ విషయంలో పోలీసుల జోక్యం చేసుకోవడంతో విగ్రహాన్ని తొలగించారు.