విగ్రహం కేసులో టీవీఎస్ చైర్మన్ కు ఊరట

విగ్రహం కేసులో టీవీఎస్ చైర్మన్ కు ఊరట

ప్రఖ్యాత టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణుశ్రీనివాసన్ దొంగతనం చేశారంటూ కేసు నమోదైంది. ఆ కేసు విచారిస్తున్న సీబీ సీఐడీ పోలీసులు శ్రీనివాసన్ ను తాము ఆరు వారాలదాకా అరెస్టు చేయబోమంటూ మద్రాసు హైకోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చారు. దీంతో హైకోర్టు కేసు విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. కపిలేశ్వరర్ ఆలయంలో ఉన్న పాతకాలం నాటి నెమలి విగ్రహాన్ని శ్రీనివాసన్ తస్కరించి ఆ చోట అలాంటిదే మరో విగ్రహం పెట్టారని ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసన్ తాను చేసిన, చేస్తున్న సేవాకార్యక్రమాలు, దేవాలయాల అభివృద్ధి పనులు, అందుకు చేసిన ఖర్చు తదితరాలను కోర్టుకు వివరించి... అసలా కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, స్వయంగా కపిలేశ్వరుడి భక్తుడినే అంటూ వకీలు ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. కపిలేశ్వర టెంపుల్ అభివృద్ధి పనుల కోసం రూ. 70 లక్షలు, రంగనాథస్వామి టెంపుల్ కి రూ. 25 కోట్లు ఇచ్చానని, తమిళనాడులోని 100  దేవాలయాలకు డొనేషన్లు ఇస్తున్నానని... ఆ సేవాకార్యక్రమాలను చూపుతూ యాంటిసిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.