ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం: మీరాకుమార్‌

ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం: మీరాకుమార్‌

దేశంలో దళితులపై నేరాలు పెరిగాయని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్నారు. వరంగల్‌లో ఇవాళ ఎస్సీ, ఎస్టీ సింహగర్జన సభలో ఆమె మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణకు దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందన్నారు.  కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రతిరోజు ఆరుగురు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను అందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. దళితుల కోసం ఉద్యమించే వారిని అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రధానిలా కాకుండా ఆరెస్సెస్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని డి.రాజా అన్నారు. రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దళిత పేదలను అణగదొక్కుతున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు.