కాంగ్రెస్‌లోకి సీనియర్‌ నేత రీఎంట్రీ?

కాంగ్రెస్‌లోకి సీనియర్‌ నేత రీఎంట్రీ?

సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్‌ నేత, మాజీ మంత్రి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా? మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్‌ పార్టీలో  తమకంటూ ప్రత్యేకవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రసాదరావు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుటుంబం తదనంతరం సంభవించిన రాజకీయ పరిణామాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలపై దృష్టి సారించకుండా పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లలో గల తన ఇంటి వద్ద ఉంటూనే జిల్లా రాజకీయ పరిణామాల పరిశీలనకే పరిమితమయ్యారు. ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరుతారంటూ కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ.. ఆ వార్తలు ప్రచారానికే పరిమితమయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి రమ్మంటూ ఆ పార్టీ నేతలు చాలా సందర్భాల్లో ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని ఇప్పటివరకు సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్న ప్రసాదరావు..ఈసారి మాత్రం ఓకే చెప్పే అవకాశాలున్నాయని తెలుస్తోంది.