'వినయ విధేయ రామ'లో ఆ సీన్ తొలగించారట!

'వినయ విధేయ రామ'లో ఆ సీన్ తొలగించారట!

'రంగస్థలం' సూపర్‌ డూపర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'వినయ విధేయ రామ'. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటు ఫ్యాన్స్‌లో.. అటు ట్రేడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో రామ్‌చరణ్‌కు బోయపటి శ్రీను సక్సెస్ అందించాడా లేదా అన్నది పక్కన పెడితే.. ఇందులో కొన్ని సీన్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి. 

కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ సినిమాను తెరకెక్కించినట్టు..  విల‌న్ చేతిలో చిక్కుకున్న అన్నయ్య (ప్రశాంత్‌) ఫోన్ చేస్తే ఎయిర్ పోర్ట్ అద్దాన్ని బద్దలుగొట్టుకుని రామ్‌చ‌ర‌ణ్ ప‌రుగున.. ఓ బ్రిడ్జి మీద నుంచి రైలు మీద‌కు దూకేసి విశాఖ నుంచి నేపాల్ బోర్డర్‌కు వెళ్తాడు. ఈ సీన్ విపరీతంగా ట్రోల్‌ అవుతోంది. కలెక్షన్లపై వీటి ప్రభావం ఉందనుకుందో ఏమోగానీ.. చిత్ర యూనిట్‌ ఈ సన్నివేశాన్ని తొలగించిందట. నష్టనివారణ చర్యలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతోనైనా ట్రోలింగ్‌ తగ్గుతుందని.. కలెక్షన్లు పెరుగుతాయని యూనిట్‌ భావిస్తోంది.