టీవీ నటి సోదరునికి బెదిరింపులు

టీవీ నటి సోదరునికి బెదిరింపులు

దివ్యాణి అనే యువతిని పెళ్లి చేసుకున్నందున తన తమ్ముడిని వేధిస్తున్నారంటూ అంజలి అనే టీవీ ఆర్టిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన దివ్యాణిని ఈ నెల 11న ఆర్యసమాజ్‌లో తన తమ్ముడు వెంకటేష్‌ పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పారు. దివ్యాణి తల్లిదండ్రులకు అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ.. తమ కూతురు కనిపించడం లేదంటూ వారు ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని అంజలి చెప్పారు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారన్నారు. ఈక్రమంలో పోలీసులు దివ్యాణిని, వెంకటేష్‌ను స్టేషన్‌కు రప్పించారు. దివ్యాణి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు.