పిడుగు పడి ముగ్గురు మృతి...

పిడుగు పడి ముగ్గురు మృతి...

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడటంతో ముగ్గురు మృతిచెందారు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో జరిగింది. రాత్రి వేళల్లో పడిన ఈ పిడుగులకు ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు రాంటెంకి రాజయ్య, కుమ్మరి బాపు, జాడి రమేష్. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ అకాల వర్షాలతో చేతికందిన ధాన్యం తడిసింది. మరోవైపు బలమైన గాలులు వీస్తుండటంతో పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.