తిరుమల రోడ్ లో.. చిరుత మృతి

తిరుమల రోడ్ లో.. చిరుత మృతి

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుతపులి మరణించింది. రహదారిలో విఘ్నేశ్వరుని ఆలయానికి పైభాగంలో రోడ్డుపై పడివున్న చిరుతపులి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అడవిలో నుంచి రోడ్డుపైకి వచ్చిన చిరుతను వాహనం ఢీకొట్టడంతో... ముఖానికి తీవ్ర గాయాలై మరణించిందని అధికారులు వెల్లడించారు. 
ఈ చిరుత వయస్సు మూడేళ్ళు ఉంటుందని వారు తెలిపారు. ఈ మధ్య కాలంలో తిరుమల గిరుల రేంజ్  లో చిరుతపులుల సంచారం కాస్త తగ్గిందని భావిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భక్తుల్లో మళ్లీ ఆందోళనలు నెలకొన్నాయి.