2.0 టీజర్ విడుదలకు టైమ్ కుదిరింది !

2.0 టీజర్ విడుదలకు టైమ్ కుదిరింది !

భారీ బడ్జెట్ చిత్రం '2.0' టీజర్ రేపు విడుదలకానున్న సంగతి తెలిసిందే.  రేపు ఎన్ని గంటలకు టీజర్ బయటికొస్తుందనే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు నిర్మాతలు.  ఉదయం 9 గంటలు ఈ టీజర్ బయటకురానుంది.  త్రీడీ ఫార్మాట్లో ఉండనున్న ఈ టీజర్ను వీక్షించేందుకు ప్రేక్షకులకు త్రీడి గ్లాసులకు అందివ్వనున్నారు థియేటర్ల యాజమాన్యం. 

ఈ సందర్బంగా రజనీ అభిమానులు ఇప్పటి నుండే సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టేశారు.  షూటింగ్ ముగిసిన తర్వాత కూడ చాన్నాళ్ల పాటు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి.  అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.  నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.