ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా 

ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రెగ్యులర్ షూట్ కి వెళ్లిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండడంతో రాయలసీమ గ్రామాలను తలపించేలా భారీ సెట్ ను రామోజీఫిలింనగర్ లో నిర్మించారు. ఇక్కడ జరిగిన మొదటి షెడ్యూల్లోనే ప్ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించారు. 

తాజాగా ఈ సినిమాపై ఓ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..ఈ సినిమాకు అసమాన్యుడు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఎక్కడా అధికారిక సమాచారమైతే లేదు. మరి ఇంత త్వరగా టైటిల్ పై రియాక్ట్ అవ్వడం ఎందుకని చిత్రబృందం భావిస్తోందట. త్రివిక్రమ్ తాజాగా చిత్రం అజ్ఞాతవాసికి కూడా ఇదే తరహాలో టైటిల్ ప్రచారం జరిగింది. మరి ఇప్పుడొచ్చిన  అసమాన్యుడు టైటిల్ పవర్ ఫుల్ గానే ఉంది. మరి చివరికి చిత్రబృందం దేన్నీ ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చుకుని..ఫిట్ గా కనిపిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఆల్రెడీ ట్యూన్స్ ను చక చక కట్టేస్తున్నాడు. ఎస్ రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 12న రిలీజ్ కానుంది.