ముగ్గురు మత్స్యకారులు గల్లంతు

ముగ్గురు మత్స్యకారులు గల్లంతు

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. విశాఖపట్నం బర్రిపేటకు చెందని ముగ్గురు మత్స్యకారులు విశాఖ నుంచి సెప్టెంబర్ 14న బోట్లలో చేపల వేటకు పారాదీప్ కు బయలుదేరారు. తిరిగి విశాఖ పట్నం చేరకుంటున్న సమయంలో తుఫాన్ ప్రభావానికి శ్రీకాకుళం జిల్లా రామాయపట్నం సమీపంలో బోటు తిరగబడి అందులో ఉన్న ముగ్గురు మత్స్యకారులు గల్లంతు అయినట్లు సమాచారం. గల్లంతైన వారి వివరాలు.. సూరడా రాము (25), వాసుపల్లి లక్ష్మణ (40), బడే సత్య (25).