ఇవాళ స్టాలిన్ తో చంద్రబాబు భేటీ

ఇవాళ స్టాలిన్ తో చంద్రబాబు భేటీ

ఏపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ చెన్నైకి వెళ్తున్నారు.  డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో  భేటీ అవుతారు. బిజేపియేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆయన, పలువురు నేతలను స్వయంగా కలుస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి చెన్నైకి చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం స్టాలిన్ తో సమావేశమవుతారు. బిజెపియేతర కూటమి ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల సీనియర్‌ నేతలు పలువురు పాల్గొననున్నారు.