పాలిసెట్‌ ఆప్షన్లకు నేడే చివరి తేదీ

పాలిసెట్‌ ఆప్షన్లకు నేడే చివరి తేదీ

పాలిసెట్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. పాలిసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌లో.. విద్యార్థులు కాలేజీల ఎంపికకు మంగళవారం వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని క్యాంప్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ రోజు ముగిసిన తర్వాత మరో అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. మొదటి దశలో సరైన కాలేజ్ లో సీట్ రాని వారు, అసలు సీట్ రాణి విద్యార్థులు ఈ రెండో దశలో ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు. అయితే రెండో దశలో 3,071 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనట్లు తెలిపారు. వీరికి ఈ నెల 13న సీట్లు కేటాయించనున్నారు అధికారులు.