మా ఆగ్రహం ప్రధానిపై కాదు.. మోడీ అనే వ్యక్తిపైనే

మా ఆగ్రహం ప్రధానిపై కాదు.. మోడీ అనే వ్యక్తిపైనే

ప్రధాని మోడీ ఏపీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నల్ల జెండాలు, ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ‘మోడీ గో బ్యాక్‌’ అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మోడీ ఏపీ రాష్ట్ర పర్యటన సందర్భంగా టాలీవుడ్ నటుడు శివాజీ మాట్లాడుతూ... ప్రధాని మోడీ పాదాలు ఏపీని తాకటంతో అపవిత్రమైందని విమర్శించారు. అన్ని విధాల నమ్మించి ఏపీని మోసం చేసిన వ్యక్తి మోడీ. ప్రధానిపై కాదు మా ఆగ్రహం మోడీ అనే వ్యక్తిపైనే అని పేర్కొన్నారు. మోడీ సభకు జండాలే బీజేపీవి, కార్యకర్తలు వివిద పార్టీలకు చెందిన వారే. ఏ రాజకీయ పార్టీ మద్దతుతో  సభ జరగబోతుందో అందరికి తెలుసన్నారు. గుంటూరు సభ నుంచి రాష్ట్రానికి ఇచ్చేది కూడా ఏమీ ఉండదు. రాజకీయ నిరుద్యోగులు, క్యారెక్టర్ లేని వ్యక్తులు రాష్ట్ర బీజేపీలో ఉన్నారని శివాజీ అన్నారు.