రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

రేపు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో జిల్లాలోని బోగోలుకు చేరుకోనున్న సీఎం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు.  ముందుగా ఉప్పలేరు వాగు ప్రారంభోత్సవం, బోగోలులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఉంటుంది. దగదర్తిలో ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేసే చంద్రబాబు, అనంతరం జరిగే సభ లో 60వేల మంది లబ్ధిదారులకు 67వేల ఎకరాల సిజేఎస్ఎఫ్ భూమికి పట్టాలు పంపిణీ చేస్తారు. 1360 ఎకరాల్లో 314 కోట్లతో ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నామని తెలిపిన కలెక్టర్ ముత్యాలరాజు,  ప్రతి ఒక్క సీజీజీఎఫ్ రైతుకు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసామని, వాటి ద్వారా పట్టాలు అందిస్తామని వివరించారు.