అక్కడ రూ.5 ఇక్కడ రూ.20

అక్కడ రూ.5 ఇక్కడ రూ.20

టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా టమోటా ఉత్పత్తి, నాణ్యతలో ప్రమాణాలు భారీగా పడిపోయాయి. మదనపల్లి రైతులు ఈ ఏడాది 15వేల హెక్టార్స్ లో టమోటాను పండించారు. అయితే ఈ వేసవి కాలంలో ఉత్యంత ఎక్కువగా 36డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో టమోటా ఉత్పత్తి, నాణ్యతలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేవలం మండే ఎండల ప్రభావం కారణంగా అక్కడి టమోటా ఉత్పత్తికి భారీ నష్టాలు వాటిల్లినట్లు రైతులు వెల్లడిస్తున్నారు. 

మేలి రకం టమోటా 10కిలోల బాక్స్ రూ. 56కాగా.. రెండో రకం టమోటా బాక్స్ రూ.30గా ఉంది. ఈ ఎండల దెబ్బతో ఆశించినంతగా ధరలు లేవని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి ఏప్రిల్ చివరి వారం వరకుగానీ... జాన్ మొదటి వారం వరకు గానీ కొనసాగనున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ రైతుల వద్ద రూపాయి పలుకుతున్న మామూలు టమోటా సాధారమ ధర మార్కెట్ లోకి వచ్చేసరికి రూ.25 పలకడం విడ్డూరంగానే ఉంది