ఏర్పాట్లలో ఈసీ.. ప్రలోభాల్లో నేతలు బిజీ..!

ఏర్పాట్లలో ఈసీ.. ప్రలోభాల్లో నేతలు బిజీ..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి నిన్న సాయంత్రం 5 గంటలకే తెరపడింది.. ఇక నిన్నటి వరకు సభల్లో, రోడ్‌షోలలో తమ ఉపన్యాసాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటు పుట్టించిన నేతలు.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. మరోవైపు ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు సీజ్ చేసిన క్యాష్, మద్యం ఇతర సామాగ్రి విలువ నిన్నటికే దాదాపు రూ.130 కోట్లకు చేరిందంటే ధన ప్రవాహం, మద్యం ప్రవాహం ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. దీనికి తోడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానిక లీడర్ల నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు పోలీసులు. ఇక రేపు ఉదయం 7  గంటలకే పోలింగ్ ప్రారంభం కానుండడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఎన్నికల సిబ్బంది బిజీ అయిపోయారు... పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి తగు సూచనలు చేసి, సామాగ్రి పంపిణీ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. దీంతో తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లలో ఓవైపు ఎన్నికల అధికారులు బిజీగా ఉంటే... మరోవైపు డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ నేతులు మరింత బిజీ అయిపోయారు.