'గీత గోవిందం' వసూళ్లు.. కేరళకి విరాళాలు !

'గీత గోవిందం' వసూళ్లు.. కేరళకి విరాళాలు !

కేరళలో సంభవించిన వరద విపత్తు భాదితుల సహాయ నిధి కోసం అక్కడి ప్రభుత్వానికి సహాయం అందించేందుకు మన తెలుగు సినీ పరిశ్రమ నేను సైతం అంటూ ముందుకు కదులుతోంది.  ఇప్పటికే పలువు నటీ నటులు, దర్సకులు, నిర్మాతలు తమ వంతు సహాయాన్ని ప్రకటించగా ఇప్పుడు 'గీత గోవిందం' చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 ముందుకొచ్చింది. 

నిన్న విడుదలైన 'గీత గోవిందం' చిత్రం కేరళలో కూడ పలు చోట్ల రిలీజై మంచి షేర్ ను రాబట్టింది.  ఈ షేర్ మొత్తాన్ని వరద సహాయ నిధికి అందజేయాలని గీత ఆర్ట్స్ 2 నిర్ణయించుకున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి బన్నీ వాస్ తెలియజేశారు.  ఇకపోతే కొన్ని రోజుల క్రితమే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.