'108 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల్లో' డబ్బు తరలింపు!

'108 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల్లో' డబ్బు తరలింపు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలిఉండడంతో ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఎక్కడి కక్కడ పెద్ద మొత్తంలో డబ్బులతో నేతల సన్నిహితులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ... 108 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు.