ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ధరఖాస్తు చేయండి

ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ధరఖాస్తు చేయండి

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు  ఈనెల 10నుంచి ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఈ విష‌య‌మై ఒక ప్రకటన చేస్తూ  తెలంగాణ‌లోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేయాల‌నుకునే ఆస‌క్తి ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 10  నుంచి 12వ తేదీ వ‌ర‌కు మూడ్రోజుల పాటు గాంధీభ‌వ‌న్‌లో వారి పూర్తి బ‌యోడెటాతో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఉత్తమ్ సూచించారు. ధరఖాస్తులు అన్ని అందిన త‌రువాత ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నిక‌ల క‌మిటీ స్క్రూటీని చేస్తుందని,  ఆ వివరాలను ఏఐసీసీకి నివేదిస్తుందని టీపీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు . తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.