ఉపరాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

శనివారం తార్నాకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)లో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. ఉదయం 9.20 గంటల నుంచి జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బయలుదేరి జుబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట ఫ్లై ఓవర్, బేగంపేట్, రైల్‌నిలయం, మెట్టుగూడ మీదుగా తార్నాకలోని ఎన్‌ఐఎన్‌ను చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం ఉదయం 11.20 గంటల సమయంలో తిరిగి తార్నాక నుంచి జుబ్లీహిల్స్ కు చేరుకొంటారు. ఆయా ప్రాంతాల్లో సూచించిన సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కమిషనర్ సూచించారు.