కార్యాలయంలోకి గిరిజనులు... తీవ్ర ఉద్రిక్తత 

కార్యాలయంలోకి గిరిజనులు... తీవ్ర ఉద్రిక్తత 

తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయనగరం జిల్లా  పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో గిరిజనులు కార్యాలయం లోపలికి దూసుకెళ్లారు. ఆందోళనాకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా గిరిజనులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. 

గిరిజనుల ఆందోళనలో ప్రధానంగా బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని, ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గిరిజన యూనివర్శిటీని తక్షణమే ప్రారంభించాలని వారు కోరారు. స్పెషల్ డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చెయ్యాలని.. ఆదివాసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలని.. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు చేస్తోన్న ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.