త్రివర్ణ పతాకం కప్పి పక్షికి అంత్యక్రియలు

త్రివర్ణ పతాకం కప్పి పక్షికి అంత్యక్రియలు

మనదేశంలో పదవిలో ఉన్న నేతలు కానీ.. లేదంటే గొప్ప వ్యక్తి మరణించినప్పుడు అతని గౌరవార్థం.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వారి భౌతిక కాయాన్ని త్రివర్ణ పతాకంతో కప్పుతారు.. అలాంటిది ఏకంగా ఒక పక్షికి అలాంటి గౌరవం దక్కితే.. ఢిల్లీలో అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. ఢిల్లీ హైకోర్టు సమీపంలో ఓ నెమలి చెట్టుపై నుంచి పడిపోయింది.. దీనిని గమనించిన కొందరు పోలీసులు తీవ్రగాయాలపాలైన నెమలిని ఆసుపత్రికి తీసుకెళ్లారుజ అయితే అప్పటికే నెమలి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జాతీయ పక్షి కావడంతో ప్రోటోకాల్ ప్రకారం త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల చర్యపై పలువురు వన్యప్రాణి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియల సమయంలో వారు ప్రోటోకాల్‌ను సక్రమంగా పాటించలేదంటున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం.. జాతీయ పక్షులు చనిపోతే.. వాటికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని అది కూడా రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో జరగాలని అంటున్నారు.  ఈ కార్యక్రమానికి ముందుగా నెమలికి పోస్ట్‌మార్టం నిర్వహించామని పోలీసు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదక వారంలో వస్తుందని అన్నారు.