వచ్చే సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు

వచ్చే సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు

త్రిపుల్ తలాక్ బిల్లుకు ఈ సమావేశాల్లో మోక్షం లభించలేదు. ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో వెల్లడించారు. బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. దీంతో ఈ బిల్లు వచ్చే శీతాకాల సమావేశాల్లో మళ్లీ సభ ముందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ముస్లిం సాంప్రదాయం ప్రకారం.. మూడు సార్లు తలాక్ అంటే విడాకులు ఇచ్చినట్లే. అయితే ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా తలాక్ చెప్పే సంస్కృతికి చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసేందుకు కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే ట్రిపుల్ చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది.

ఈ సవరణ ప్రకారం ముమ్మారు తలాక్‌ చెప్పిన భర్తలపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయొచ్చు. అయితే... అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్‌ పొందవచ్చు.  మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చే వీలు ఈ సవరణ కల్పించనుంది.  దీంతోపాటు బాధితురాలు తన మైనర్‌ చిన్నారుల సంరక్షణ బాధ్యతలు అప్పగించమని న్యాయస్థానాన్ని కోరవచ్చు. అయితే.. తలాక్‌ చెప్పడం చట్ట వ్యతిరేకమని, భర్తకు మూడేళ్ల జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని గతంలోనే ఈ బిల్లులో పొందుపరిచారు. రెండు వివాదాస్పద ప్రతిపాదనలను మార్చాలని భావిస్తున్నారు. అయితే బిల్లుకు డిసెంబర్ లో లోక్ ఆమోద ముద్రవేసింది. ఈ బిల్లుకి లోక్‌సభలో ఆమోద ముద్రపడినా.. రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ లేకపోవటంతో ఆ బిల్లుకు ఆమోదం దక్కలేదు.