ఇద్దరు జగిత్యాల బిడ్డలైతే సమాధానం చెప్పండి

ఇద్దరు జగిత్యాల బిడ్డలైతే సమాధానం చెప్పండి

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, టీడీపీ నేత ఎల్.రమణ ఇద్దరు జగిత్యాల బిడ్డలైతే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ నేత, ఎంపీ కవిత సవాల్ విసిరారు. టీడీపీ,కాంగ్రెస్ నేతలకు నైతిక హక్కు ఉందా అని కరీంనగర్ లో అన్నారు. ఇద్దరు నాయకులు ఉద్యమ నాయకుల ఆకాంక్షలు నెరేవేవేర్చలేరని పేర్కొన్నారు. జగిత్యాలలో రమణ, జీవన్ రెడ్డి ఒకే వేదికపై ప్రెస్ మీట్ పెట్టి అలాయి బలాయి చేసుకున్నారని కవిత తెలిపారు. ప్రతి నాయకుడు అడుగడుగునా తెలంగాణకు అడ్డువచ్చారని ఆరోపించారు. జీవన్ రెడ్డి... వైఎస్ తో డీల్ చేసుకొని కేసీర్ పై పోటీ చేశారని విమర్శించారు. ఇక రమణ చంద్రబాబుకు బయపడి ఇంటి నుంచి బయటకు రాలేదని ఆరోపించారు. అలాంటి మీరు తెలంగాణ సాధన కోసం ఉద్యమించారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు ఉద్యమం కోసం పదవులు వదులుకున్నారని స్పష్టం చేశారు. నూకపల్లి హోసింగ్ బోర్డులో భూమి రేట్లు పెంచి మీ తమ్ముడి ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎక్కువ డబ్బులు తీసుకున్నా విషయం వాస్తవం కాదా  అని ప్రశ్నించారు.