ప్రధానికి టీఆర్ఎస్‌ ఎంపీల వినతి...

ప్రధానికి టీఆర్ఎస్‌ ఎంపీల వినతి...

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిశారు టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యులు... న్యూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించాల్సింది ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు ఎంపీలు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి నేతృత్వంలో ఎంపీ వినోద్, బూర నర్సయ్యగౌడ్, సంతోష్‌కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన వారిలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని, టీఆర్ఎస్ ఎంపీల మధ్య సరదా సంభాషణ సాగింది. టీఆర్ఎస్ అంత పెద్ద మెజారిటీతో గెలిచినా.. తనకు ఒక్క మిఠాయి కూడా తినిపించలేదని టీఆర్ఎస్ ఎంపీలతో సరదాగా వ్యాఖ్యానించారు మోడీ. మంత్రులు, ఎంపీలకు మిఠాయిలు తినిపించి.. నాకు మాత్రం ఇవ్వరా? అని మోదీ అన్నారు. పుల్లారెడ్డి స్వీట్స్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇస్తామని ప్రధానికి చెప్పామని... బెల్లం, కాజుతో చేసే మిఠాయి స్వయంగా వచ్చి ఇస్తానని ఆయనకు చెప్పినట్టు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అనంతరం మీడియాకు వెల్లడించారు.