ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్‌

ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్‌

ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లును సమర్థిస్తున్నట్టు లోక్‌సభలో చర్చ సందర్భగా వెల్లడించారు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి... అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఆయన మాట్లాడుతూ... ఆలస్యమైనా ఈ నిర్ణయంతో అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ బిల్లుతో ఎంతో ఉపయోగకరమని ప్రకటించిన టీఆర్ఎస్ ఎంపీ... అయితు, 10 శాతం రిజర్వేషన్లతో సమస్య పరిష్కారం కాదన్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు మారుతుంటాయని... ఇక తెలంగాణ విషయానికి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పక్కనే ఉన్న తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నట్లే తెలంగాణలో కూడా అనుమతించాలని కోరారు జితేందర్‌రెడ్డి. ఇంకా జితేందర్ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...