12 జాతీయ స్థాయి సర్వేల్లో టీఆర్ఎస్‌దే విజయం...

12 జాతీయ స్థాయి సర్వేల్లో టీఆర్ఎస్‌దే విజయం...

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయి... 12 జాతీయ స్థాయి సర్వేలు టీఆర్ఎస్సే గెలుస్తుందని చెప్పాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అజెండా గెలవాలన్న కేసీఆర్... ప్రధాని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే దేశం మనది... నేను కాంగ్రెస్ ఏజెంట్ అని నరేంద్ర మోడీ అంటారు... మోడీ ఏజెంట్ అని రాహుల్ గాంధీ అంటారు... నేను ఎవరికి ఏజెంట్ కాదు... తెలంగాణ ప్రజల ఏజెంట్‌ను అని స్పష్టం చేశారు. నాకు హిందీ బాగా వచ్చు! రాష్ట్రంలో ఎలక్షన్ల తర్వాత ఢిల్లీ వెళ్లి హిందీలో రెండు పార్టీలను చీల్చు చెండాడుతానని మండిపడ్డారు. రాహుల్ గాంధీ... తోక గాంధీ కాదు కావాల్సింది అంటూ సెటైర్లు వేశారు కేసీఆర్. జమాలపురంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా, కట్టలేరు పై చెక్ డాం నిర్మిస్తా, లిఫ్ట్ పెట్టి సాగునీటి కష్టాలు తీరుస్తా, బోనకల్లు, ఎర్రుపాలెంలో ఒక చోట డిగ్రీ కాలేజ్ ఇస్తామని హామీ ఇచ్చారు.