ట్రూకాలర్‌ చేతికి చిల్లర్‌ యాప్‌

ట్రూకాలర్‌ చేతికి చిల్లర్‌ యాప్‌

దేశంలో మొట్టమొదటి మల్టి బ్యాంక్‌ పేమెంట్స్‌  యాప్‌ అయిన 'చిల్లర్'ను ట్రూకాలర్‌ కొనుగోలు చేసింది. గత ఏడాది మార్చిలో ట్రూకాలర్‌ పే పేరుతో డిజిటల్‌ పేమెంట్‌ విభాగంలోకి ట్రూకాలర్‌ ప్రవేశించింది.   మొబైల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌ మరింత దూసుకుపోవాలనే లక్ష్యంతో చిల్లర్‌ను కొనుగోలు చేసినట్లు ట్రూకాలర్‌  తెలిపింది.  చిల్లర్‌కు మనదేశంలో 15 కోట్ల మంది యూజర్స్‌ ఉన్నారు. దాదాపు 300 సంస్థలతో భాగస్వామ్యముంది. వీటిన్నింటిని ట్రూకాలర్‌ పే ప్లాట్‌ఫామ్‌ కోసం ఉపయోగించుకుంటారు.