చేతులు కలిపిన ట్రంప్‌- కిమ్‌..

 చేతులు కలిపిన ట్రంప్‌- కిమ్‌..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం ముగిసింది. మొన్నటి వరకు పరస్పరం తిట్టిపోసుకున్న ఈ ఇద్దరు నేతలు సింగపూర్‌ వేదికగా 48 నిమిషాలపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు కిమ్‌-ట్రంప్‌లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సహకరించాలని ట్రంప్‌.. కిమ్‌కు సూచించినట్టు తెలిసింది. ఏకాంత చర్చల అనంతరం ఇరుదేశాల దౌత్యనేతలతో ట్రంప్‌, కిమ్‌ సమావేశమయ్యారు. అంతకముంగా మీడియాతో కిమ్‌ మాట్లాడుతూ.. చర్చలు ఫలప్రదమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై ప్రతిష్టంభనకు పరిష్కారం చూపడమే ఏకైక  ఎజెండాగా  ఈ సమావేశం జరుగుతోంది.  ఈ చరిత్రాత్మక భేటీలో ట్రంప్‌ షరతులకు కిమ్‌ తలొగ్గుతారా? అణ్వస్త్రాల్ని విడిచిపెట్టేందుకు ఉత్తర కొరియా అంగీకరిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇరువురి మధ్య జరిగే భేటీ విజయవంతం అవుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి.