హెచ్1-బీ వీసా ఉంటే అమెరికా పౌరులు కావచ్చు

హెచ్1-బీ వీసా ఉంటే అమెరికా పౌరులు కావచ్చు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ చల్లని వార్త చెప్పారు. హెచ్1-బి వీసాలలో మార్పులు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అత్యంత విద్యావంతులైన వలసదారులు ప్రత్యేక నైపుణ్య వృత్తులలో పనిచేసేందుకు జారీ చేసే హెచ్1-బి వీసాలను సరళతరం, కచ్చితత్వంతో ఉండేలా రూపొందించనున్నట్టు తెలిపారు. హెచ్1-బి వీసాపై పనిచేసే ఉద్యోగులు అమెరికా పౌరులు అయ్యే అవకాశాన్ని కూడా కల్పించనున్నట్టు చెప్పారు. ‘అమెరికాలోని హెచ్1-బి వీసాదారులు నిశ్చింతగా ఉండొచ్చు. త్వరలోనే మార్పులు రాబోతున్నాయి. ఇవి మీరు ఉండేందుకు సరళంగా, కచ్చితత్వంతో కూడి ఉంటాయి. వీటి ద్వారా భవిష్యత్తులో పౌరసత్వం పొందే అవకాశం కూడా ఉండొచ్చు. మేం ప్రతిభ గల, అత్యంత నిపుణులను అమెరికాలో వృత్తి ఉద్యోగాలు చేపట్టేందుకు ప్రోత్సహిస్తాం’ అని ట్రంప్ ఈ ఉదయం ట్వీట్ చేశారు.

రిపబ్లికన్ అయిన ట్రంప్, కాంగ్రెస్ లోని డెమోక్రాట్స్ మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. దేశానికి దక్షిణ సరిహద్దుల్లో గోడ కట్టేందుకు 5.6 బిలియన్ డాలర్లు మంజూరు చేసే వరకు ఫెడరల్ ప్రభుత్వ చరిత్రలోనే ఎన్నడూ లేని అతిపెద్ద షట్ డౌన్ ఎత్తేయడానికి ట్రంప్ నిరాకరిస్తున్నారు. ధ్రువపత్రాలు లేని వలసదారులు, శరణు కోరేవారిని ట్రంప్ మెక్సికో నుంచి దేశంలోకి చొరబడే నేరగాళ్లుగా, ఉగ్రవాదులుగా చిత్రిస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ లేదా అంత కంటే ఎక్కువ విద్య కలిగినవారు మాత్రమే దరఖాస్తు చేసే హెచ్1-బి వీసాకి దరఖాస్తు చేసేవారిని ఆయన తరచూ ప్రశంసిస్తారు. తాత్కాలిక వీసాలకు పోటీ తీవ్రంగా ఉంది. 2018లో అమెరికా హెచ్1-బి వీసాల జారీపై పరిమితి విధించింది. ఏప్రిల్ మొదటి వారం నాటికి అమెరికా 65,000 హెచ్1-బి వీసాలు జారీ చేయవచ్చు.