సాహసోపేతమైన నిర్ణయం : లక్ష్మణ్

సాహసోపేతమైన నిర్ణయం : లక్ష్మణ్

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల పెంపు పై కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వాగతించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.  రాజకీయ పార్టీలు సహజంగా రాజకీయ నిర్ణయాలే తీసుకుంటాయని, రిజర్వేషన్లు ఇవ్వాలా  వద్దా అని కాంగ్రెస్ చెప్పాలన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, మళ్ళీ రిజర్వేషన్లు నిర్ణయించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వొచ్చు..కానీ ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటని లక్ష్మణ్ అన్నారు . ఈ విషయంలో అసద్, కోదండరాం లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచడం వలన బీసీ లకు,ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరగదని, ఆర్.కృష్ణయ్య సంకుచితమైన భావనతో ఆలోచించకూడదని హితవు పలికారు.