ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఈ రోజు ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలోని బీఏడ్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఎడ్ సెట్ కి 38,693 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే మే 31న ఆన్ లైన్ ద్వారా ఎడ్ సెట్-2018 పరీక్షను  నిర్వహాయించారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 32,330 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 30,606 మంది అర్హత సాధించారు. అయితే హాజరు అయిన వారిలో 25 వేలకు పైగా మహిళలే ఉండటం విశేషం. 'ప్రతి పరీక్షలోను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తగ్గుతున్నారు. మహిళల కన్నా పురుషుల ఎన్రోల్ మెంట్ కూడా తగ్గుతోంది. దీనికి సంబంధించి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని' చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు.