పార్టీకి ద్రోహం చేసేవారికి అధోగతి : తుమ్మల

పార్టీకి ద్రోహం చేసేవారికి అధోగతి : తుమ్మల

పార్టీ కి ద్రోహం చేసేవారు.. మోసం చేసే వారు ఎక్కువకాలం రాజకీయాల్లో మనలేరని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఖమ్మంలో సర్పంచుల సన్మాన సభలో మాట్లాడిన ఆయన, ఓడించామని తాత్కాలికంగా రాక్షస ఆనందానికి లోనయ్యే వారు అధోగతి పాలు అవుతారని హెచ్చరించారు.  రాజకీయాల్లో ప్రజాసేవ కోసం ఉన్న వారిని గౌరవించుకోవాలని సూచించిన మాజీ మంత్రి తుమ్మల, తాత్కాలిక మెరువులు ఆశించే వారికి భవిష్యత్ ఉండదని స్పష్టం చేసారు.