తెలంగాణ ఐసెట్-19 షెడ్యూల్ ఇదే..

తెలంగాణ ఐసెట్-19 షెడ్యూల్ ఇదే..

తెలంగాణ ఐసెట్-19 షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఐసెట్ చైర్మన్ , కాకతీయ యూనివర్సిటీ విసి ప్రొ. సాయన్న కొద్దిసేపటి కిందట విడుదల చేసారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 21 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. మే 23, 24 ఐసెట్ పరీక్షాలు ఉంటాయని ఐసెట్ చైర్మన్ ప్రొ. సాయన్న తెలిపారు. మార్చి 7 ఆన్ లైన్ అప్లికేషన్  ప్రారంభమవుతుందని వివరించారు. మే 19న హాల్ టిక్కెట్ డౌన్ లోడ్  చేసుకోవచ్చని..పిలిమనరి కీ మే 29 న, జూన్ 1వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ఐసెట్ చైర్మన్ ప్రొ. సాయన్న ప్రకటించారు.  మొత్తం 14 సెంటర్లలోని పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయి.  తెలంగాణలో 10 సెంటర్లు, ఏపీ లో 4 సెంటర్లు ఉంటాయని చెప్పారు. జూన్ 13న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామన్నారు.