టీఎస్ఎంసెట్‌ ఫీజు చెల్లింపు గడువు పెంపు

టీఎస్ఎంసెట్‌ ఫీజు చెల్లింపు గడువు పెంపు

టీఎస్ఎంసెట్‌ ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ పెంచింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్‌ ముగిసింది. అయితే మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ప్రకటించారు. మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఇంతకుముందు ఈ నెల 12వ తేదీ వరకు చివరి గడువును ఇచ్చారు.. కానీ రెండో శనివారం, ఆదివారం రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గడువు అధికారులు పొడిగించారు.