16న వీఆర్ఓ పరీక్ష

16న వీఆర్ఓ పరీక్ష

విలేజ్‌ రెవిన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ) పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం  చేశామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (టీఎస్పీఎస్పీ) కార్యదర్శి వాణి ప్రసాద్‌ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 7 లక్షలకు మించి  దరఖాస్తులు రాలేదని,  ఈ పరీక్షకు  మాత్రం 11 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఆమె తెలిపారు. 31 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 2,945 సెంటర్స్ లలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు  7 లక్షల మంది హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని, కొన్ని జిల్లాల్లో సెంటర్లు  సరిపోక కొంతమందిని  కోరుకున్న సెంటర్ లో కాకుండా... వేరే ప్రాంతాల్లో  కేటాయించడం జరిగిందన్నారు. ఇబ్బందులు రాకుండా హాల్ టికెట్లు వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఐడీ ప్రూఫ్, హాల్ టికెట్ తప్పని సరిగా తేవాలన్నారు. వివరాలను సరిగా నమోదు చేసుకోని సుమారు  రెండు వేల మంది అభ్యర్థులకు ఎడిట్ చేసుకోవాలని మెసేజ్ లు  పెట్టామని వాణి ప్రసాద్ తెలిపారు. బయో మెట్రిక్ అటెండెన్స్ లేదని ఆమె తెలిపారు.