ఆర్టీసీలో మోగెన్ సమ్మె సైరన్

ఆర్టీసీలో మోగెన్ సమ్మె సైరన్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) సమ్మె సరైన్ మోగనుంది... తమ సమస్యలు, సంస్థ పరిరక్షణ తదితర మొత్తం 72 డిమాండ్లతో ఈ రోజు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు ఆర్టీసీ జేఏసీ సంఘాలు... ఈ నెల 21వ తేదీ వరకు సమయం ఇచ్చి... ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్లడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి ఆర్టీసీలోని సంఘాలు. డిమాండ్లలో ముఖ్యంగా కొత్త వేతనాల అమలు, పని భారాన్ని తగ్గించడం, ఖాళీలను భర్తీ చేయడం, ఓటీ చెల్లించడం, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడం, హైర్ బస్సులను రద్దు చేయడం, కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించడం, అక్రమ రవాణాను అరిట్టడం, రిటైర్ట్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించేలా చూడడం లాంటివి ఉన్నాయి.