ఆ ఇద్దరికీ టీటీడీ నోటీసులు

ఆ ఇద్దరికీ టీటీడీ నోటీసులు

తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది.  టీటీడీపై చేసిన అసత్య ఆరోపణలకు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల ద్వారా కోరింది. టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేసిన ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొంది. వీరిద్దరికీ పోస్టు ద్వారా టీటీడీ నోటీసులు పంపించింది. వేంకటేశ్వరుని ఆభరణాలు సీఎం చంద్రబాబు ఇంట్లో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. రమణ దీక్షితులు సైతం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో 'దేవస్థానం పరువుకు భంగం కలిగించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాల'ని కోరింది.