బుల్లి తెర నటి ఝాన్సీ ఆత్మహత్య

బుల్లి తెర నటి ఝాన్సీ ఆత్మహత్య

బుల్లి తెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. 'పవిత్ర బంధం' సీరియల్‌లో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఝాన్సీ.. శ్రీనగర్ కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని నిన్న రాత్రి ప్రాణాలు తీసుకుంది. గత కొంతకాలంగా ఒక యువకుడితో ఝాన్సీ ప్రేమలో ఉన్నదని.. ప్రియుడితో ఆమెకు తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ కారణంగానే ఆమె ప్రాణం తీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియుడితో కొంతకాలం సహజీవనం కూడా చేసిందని సమాచారం. ప్రేమ వ్యవహారం కారణంగా ఝాన్సీ నటనకు దూరమైందని.. ఈ విషయమై తల్లిదండ్రులతో కూడా ఆమెకు గొడవలు జరిగాయని తెలుస్తోంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఝాన్సీ ప్రియుడు ఎవరు? ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి? అనే విషయాలపై దర్యాప్తు ప్రారంభించారు.