నకిలీ రిపోర్టర్స్ హల్చల్...

నకిలీ రిపోర్టర్స్ హల్చల్...

మిర్యాలగూడలో నకిలీ రిపోర్టర్స్ హల్చల్ చేస్తున్నారు. టిన్యూస్, టీవీ9, ఎన్టీవీ, ఎచ్ఎంటీవీ ఇలా అనేక ఛానెల్స్ పేర్లు చెపుతూ.. రైస్ మిల్లర్ల నుంచి నకిలీ రిపోర్టర్స్ భారీ మొత్తంలో డబ్బులు వస్సులు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకల్ రిపోర్టర్స్ మిర్యాలగూడ డిఎస్పీకి పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైస్ మిల్లుల్లోని సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.