ట్విట్టర్‌లో ఇక సీక్రెట్‌

ట్విట్టర్‌లో ఇక సీక్రెట్‌

ట్విట్టర్‌లో సరికొత్త ఆప్షన్ రానుంది... తన వినియోగదారులు 'రహస్య సంభాషణలు' చేసుకునేందుకు వీలుగా కొన్ని మార్పులు చేస్తోంది ట్విట్టర్... ఇప్పటికే దీనిపై ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే మొదటి నుంచి చివరి వరకు అంతా సీక్రెట్‌గా సంభాషించుకునే వీలుంటుంది. ఫేస్‌బుక్, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి సంస్థలు అందిస్తున్న ఈ ఆప్షన్‌ను త్వరలోనే ట్విట్టర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

ట్విట్టర్ తాజా వర్షన్‌తో పంపినవారు మరియు రిసీవర్ మాత్రమే చదవగలరు. మూడవ వ్యక్తి గానీ, హ్యాకర్లు బెడదలేకుండా ఈ సంభాషణలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం, పబ్లిక్ ఫేసింగ్ వెబ్‌సైట్లలో వీక్షించలేని బ్యాకెండ్ చాట్ రూమ్‌ వినియోగదారులను అందిస్తుంది ట్విట్టర్. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను ఉపయోగించడం ద్వారా మూడో వ్యక్తికి తెలియకుండా మెసేజింగ్ ఫీచర్ తెస్తోంది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా కుంభకోణం నేపథ్యంలో, ట్విట్టర్ తమ యూజర్ల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ట్విట్టర్ కొత్త ఆప్షన్... త్వరలో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.