నేడు రెండు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం..

నేడు రెండు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం..

నవ్యాంధ్ర రాజధానిలో ఇవాళ రెండు కీలకమైన రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. కృష్ణా నదిపై ఇబ్రహీంపట్నం, ఉద్దండరాయపాలెంను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది... రూ. 1387 కోట్లతో 3.2 కిలోమీటర్ల మేర ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తారు. భారతీయ యోగముద్రతో బ్రిడ్జి డిజైన్ రూపొందించింది ఎల్ అండ్ టీ సంస్థ. తక్కువ పిల్లర్లు, ఎక్కువ కేబుళ్లతో ఈ నిర్మాణం ఉంటుంది. హైదరాబాద్‌, భద్రాచలం హైవేల నుంచి నేరుగా అమరావతికి వెళ్లేలా బ్రిడ్డి ఉపయోగపడనుంది. అమరావతి నీటి అవసరాల కోసం రూ. 740 కోట్లతో నిర్మించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రాజెక్టుకు కూడా ఇవాళే శంకుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం.