హైదరాబాద్, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, తిరుపతిల మధ్య రెండు ప్రత్యేక రైళ్లును నడపనుంది. హైదరాబాద్‌-తిరుపతి స్పెషల్‌ (ట్రైన్ నెంబర్‌: 02764) హైదరాబాద్‌ నుంచి ఈ నెల 15న రాత్రి 7.40 గంటలకు బయల్దేరి, ఆ తర్వాతి ఉదయం 8.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-హైదరాబాద్‌ స్పెషల్‌ (ట్రైన్ నెంబర్‌: 02763) ఈ నెల 17న రాత్రి 7 గంటలకు బయల్దేరి, మరుసటి ఉదయం 8.35 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్, ఖాజిపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మరియు రేణిగుంట స్టాపులలో ఆగుతుంది.