యుఎఫ్ సి ఫైటర్ ని బెదిరించి చావుదెబ్బలు తిన్నాడు

యుఎఫ్ సి ఫైటర్ ని బెదిరించి చావుదెబ్బలు తిన్నాడు

శనివారం రాత్రి బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో ఒక వ్యక్తి దొంగతనం చేయబోయి చావుదెబ్బలు తిన్నాడు. ఇంటి బయట క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న మహిళకు ఆ దొంగ తుపాకీ గురిపెట్టబోయాడు. కానీ ఆ దొంగకి తను చెలగాటమాడుతోందని ఓ మహిళా యుఎఫ్ సి ఫైటర్ తోనని.. అదీ ఆ మహిళ చాంపియన్ పోలియానా వియానా అని తెలియదు పాపం. పోలియానా వియానా ఆ దొంగని పట్టుకొని అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. దాంతో ఆ దొంగ మొహం షేపులు మారిపోయాయి. ఇంక పోలియానాతో తలపడలేనని గుర్తించిన దొంగ పోలీసులు వచ్చి తీసుకెళ్లే వరకు కిమ్మనకుండా కూర్చున్నాడు.

తను ఇంటి బయట క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి కూర్చున్నట్టు ఫైటర్ పోలియానా ఎంఎంఏ జంకీకి చెప్పింది. ఆ వ్యక్తి పోలియానాను టైమ్ అడిగాడు. జేబులో నుంచి మొబైల్ తీయగానే ఆ వ్యక్తి బెదిరిస్తూ ‘నీ మొబైల్ ఇచ్చేయ్. కదిలాలని చూస్తే కాల్చి పారేస్తా. నా దగ్గర తుపాకీ ఉందని’ అన్నాడు. తుపాకీని వీపులో గుచ్చాడు. కానీ అది మెత్తగా ఉండటంతో అది తుపాకీ కాదని ధైర్యం తెచ్చుకున్న పోలియానా దాడికి సిద్ధమైంది. 

అతను తనకి చాలా దగ్గరగా ఉండటాన్ని కూడా పోలియానా అనుమానించింది. తుపాకీ ఉంటే దూరం నుంచి కూడా బెదిరించేవాడని గుర్తించింది. అంతే.. ఇంక ఆ దొంగకి దబిడి దిబిడి మొదలైపోయింది. మొహం రెండంటే రెండే పిడిగుద్దులు, ఆ తర్వాత ఓ కిక్.. కింద పడిన దొంగ మరి లేవలేదు. ఇంతకు ముందు కూర్చున్న ప్రదేశంలోనే కూర్చోబెట్టి పోలీసులు వచ్చేదాకా ఆగమని చెప్పింది. ఈ విషయాన్ని యుఎఫ్ సి ప్రెసిడెంట్ దానా వైట్ ఒక ఫోటోతో షేర్ చేసింది. పోలియానా ధైర్యాన్ని తెగ పొగిడింది. పోలీసులు వచ్చి దెబ్బలతో ముక్కూమొహం ఏకమైన ఆ దొంగని ముందు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాక పోలీస్ స్టేషన్ కి తరలించారు.