బీజేపీ ఎంపీ గుడ్ బై

బీజేపీ ఎంపీ గుడ్ బై

యూపీలో బీజేపీకి షాక్ తగిలింది. కమలం పార్టీ ఎంపీ సావిత్రి బాయ్ పూలే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి  గుడ్ బై చెప్పారు. ఆమె యూపీలోని బాహ్ రిచ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  గతంలో ఆమె పలుమార్లు పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోమారు పార్టీ అధిష్టానంపై ఫైర్ అయ్యారు. దేశ అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డబ్బును.. విగ్రహాలా తయారికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో చీలిక తీసుకురావటానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆమె ఆరోపించారు. తాను సంఘ సేవకురాలిననీ వెల్లడించారు. తాను దళితుల కోసం పోరాడుతున్నాని పేర్కొన్నారు. దళితులు అభ్యున్నతికి బీజేపీ ఏమి చేయటం లేదని వెల్లడించారు. గతంలో యూపీ సీఎం యోగి లార్డ్ హనుమాన్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఆయన హనుమాన్ దళితుడు అని వ్యాఖ్యానించారు.దీనిపై కూడా  పూలే అభ్యంతరం చెప్పారు.